Narsipatnam: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నలుగురికి జైలు శిక్ష, జరిమానా
Narsipatnam: నర్సీపట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురికి జైలు శిక్ష, జరిమానా విధించిన కోర్టు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలుంటాయని పోలీసుల హెచ్చరిక.
Narsipatnam: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నలుగురికి జైలు శిక్ష, జరిమానా
నర్సీపట్నం: నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నలుగురు వ్యక్తులకు ఈ రోజు (21.09.2026) గౌరవ AJFCM కోర్టు, నర్సీపట్నం వారు శిక్ష విధించారు. ప్రతి ఒక్కరికి రూ.10,000/- జరిమానాతో పాటు వారిలో ఒకరకి వారం రోజులు, ఇంకొరకి రెండు రోజులు, మరో ఇద్దరికి ఒక రోజు పాటు జైలు శిక్ష విధిస్తూ గౌరవ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తద్వారా వాహనదారులతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలుగుతుంది. కాబట్టి ప్రజలు మద్యం సేవించిన తరువాత వాహనాలు నడపవద్దని సూచించడమైనది. మద్యం సేవించిన వారు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని, తమతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాము.
“మద్యం సేవించి వాహనం నడపవద్దు – మీ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడండి.”
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నర్సీపట్నం టౌన్ పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడమైనది.




