Narsipatnam: నర్సీపట్నంలో 'డయా బెస్ట్ ప్రైస్ అవుట్‌లెట్' ప్రారంభం!

Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ రామారావుపేటలో ఏర్పాటు చేసిన 'డయా బెస్ట్ ప్రైస్' అవుట్‌లెట్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి ప్రారంభించారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 16 Nov 2026 1:02 PM IST
Narsipatnam
X

Narsipatnam: నర్సీపట్నంలో 'డయా బెస్ట్ ప్రైస్ అవుట్‌లెట్' ప్రారంభం!

నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని రామారావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన 'డయా బెస్ట్ ప్రైస్' అవుట్‌లెట్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి సోమవారం రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ అవుట్‌లెట్ ప్రొప్రైటర్‌గా వూడా సూర్యరావు వ్యవహరిస్తున్నారు.

​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పద్మావతి మాట్లాడుతూ.. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ అవుట్‌లెట్‌లో లభించే ప్రత్యేకమైన రైస్‌ను తినడం వల్ల షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు, ధృవీకరించినట్లు తెలిపారు. అయితే, కేవలం ఈ రైస్ మీదనే పూర్తిగా ఆధారపడకుండా, వ్యాధిగ్రస్తులు నిత్యం తమ షుగర్ లెవెల్స్‌ను చెక్ చేసుకుంటూ తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాలమూరి బంగార్రాజు, జాలమూరి రాజ్‌కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam