Narsipatnam: చెత్త సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి!

Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వార్డు సమస్యపై తక్షణ స్పందన. చెత్త తొలగింపు చర్యలు చేపట్టిన మున్సిపల్ చైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి. రిపోర్టర్: ఆర్.ఎ. నాయుడు.

R. A. Naidu, Narsipatnam
Published on: 11 Nov 2026 1:56 PM IST
Narsipatnam
X

Narsipatnam: చెత్త సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి!

Narsipatnam: ​సమస్య తమ దృష్టికి రావడమే తరువాయి, తక్షణ పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ నర్సీపట్నం నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. నర్సీపట్నం 38వ వార్డు పరిధిలోని చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో, పోలీస్ స్టేషన్ ప్రహరీకి ఆనుకుని స్థానికులు చెత్తను వేస్తూ ఆ ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్‌లా మారుస్తున్నారని ఈ రోజు దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆమె తక్షణమే స్పందించారు.

హుటాహుటిన ఉదయాన్నే ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. వెంటనే శానిటరీ సిబ్బందిని అక్కడికి పిలిపించి, పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించారు. అనంతరం అక్కడ ఉన్న చెత్త డబ్బాను శాశ్వతంగా తీసివేయించి, ఇకపై అక్కడ ఎవరూ చెత్త వేయకుండా నిషేధిత బోర్డును ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పద్మావతి మాట్లాడుతూ.. వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని గుర్తుచేశారు. స్థానికులు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా వేయకుండా, తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకే అందించి పచ్చదనం, పరిశుభ్రతకు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam