Narsipatnam: బీజేపీ విస్తృతస్థాయి సమావేశం - స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం
Narsipatnam: నర్సీపట్నంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ధర్మంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపు.
Narsipatnam: బీజేపీ విస్తృతస్థాయి సమావేశం - స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం
నర్సీపట్నం: నర్సీపట్నంలో సోమవారం బీజేపీ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు కిల్లాడ సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ఇన్‌చార్జిగా విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్‌ను నియమించడం శుభపరిణామమన్నారు.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, విశాఖ డెయిరీ డైరెక్టర్ శ్రీరంరెడ్డి సూర్యనారాయణ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, నాయకులు కూడా ఎన్నికలకు సన్నద్ధం కావాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
స్థానిక ఎన్నికల్లో పోటీకి బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నర్సీపట్నం మండల అధ్యక్షుడు నిద్దర శ్రీనివాస్, నర్సీపట్నం మున్సిపాలిటీ అధ్యక్షుడు బోలెం అప్పన్నదొర, మాకవరపాలెం మండల అధ్యక్షుడు మర్రి నాయుడు, గవిరెడ్డి త్రినాథ్, మహిళా నేత రజనీ, రమణయాదవ్‌తో పాటు పలువురు నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.




