Nakkapalli: నక్కపల్లిలో టీడీపీ ఘన విజయం.. హోంమంత్రి అనిత శుభాకాంక్షలు

Nakkapalli: నక్కపల్లి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి 1,111 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలిచారు. 14 వార్డుల్లో 11 టీడీపీకే. హోంమంత్రి అనిత అభినందన.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 29 Nov 2026 9:08 PM IST
Nakkapalli
X

Nakkapalli: నక్కపల్లిలో టీడీపీ ఘన విజయం.. హోంమంత్రి అనిత శుభాకాంక్షలు

నక్కపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా నక్కపల్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మేడేటి శంకర్ సతీమణి భాగ్యలక్ష్మి భారీ మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థిపై 1,111 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

నక్కపల్లి పంచాయతీలో మొత్తం 14 వార్డులకు గాను 11 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ విజయంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నక్కపల్లిలో పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విజయోత్సవాల్లో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.

సర్పంచ్‌గా విజయం సాధించిన భాగ్యలక్ష్మికి, ఆమె భర్త మేడేటి శంకర్‌కు మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయాలతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ విజయాలు కూటమి నాయకులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.