Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సులో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్!

Visakhapatnam: విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్ పాల్గొని రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి అవకాశాలపై మాట్లాడారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 9 Oct 2026 11:27 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సులో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్!

Visakhapatnam: న్యూఢిల్లి భాగస్వామ్య సదస్సు–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారు, సీఐఐ ప్రతినిధులతో కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా ఎదుగుతోందని, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 714 ప్రాజెక్టులకు సంబంధించి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఉండటం, వీటి ద్వారా సుమారు 7.1 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉండటం రాష్ట్ర అభివృద్ధి దిశను ప్రతిబింబిస్తోందని తెలిపారు.

అక్టోబర్ 7న విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ ప్రాంతీయ భాగస్వామ్య సదస్సు కూడా పెట్టుబడుల ఆకర్షణలో కీలక ముందడుగుగా నిలిచిందని శ్రీభరత్ పేర్కొన్నారు. ఈ సదస్సులో రూ.37,261 కోట్ల విలువైన 29 అవగాహన ఒప్పందాలు కుదరగా, వాటి ద్వారా 92,247 ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని తెలిపారు.

ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే ఇటువంటి సదస్సులు స్థానిక పరిశ్రమల అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఈ ప్రయత్నాలకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఎంపీ శ్రీభరత్ అన్నారు.

నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు–2026కు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో హాజరై, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని శ్రీభరత్ ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములై, రాష్ట్ర ఆర్థిక పురోగతికి, యువతకు ఉపాధి కల్పనకు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.

విశాఖపట్నాన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, సాంకేతికత, ఉపాధి అవకాశాలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇటువంటి అంతర్జాతీయ స్థాయి వేదికలు మరింత దోహదపడతాయని ఎంపీ శ్రీభరత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.