Gopalapatnam: శ్రీహరిపురంలో ఇండోర్ స్టేడియంకు ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు శంకుస్థాపన
Gopalapatnam: శ్రీహరిపురం ఉడా కాలనీ MIG లో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఎంపీ భరత్ కుమార్, ఎమ్మెల్యే గణబాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
Gopalapatnam: శ్రీహరిపురంలో ఇండోర్ స్టేడియంకు ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు శంకుస్థాపన
గోపాలపట్నం: గోపాలపట్నం నియోజకవర్గంలోని శ్రీహరిపురం ప్రాంతంలో 60 ఓ వార్డ్ ఉడా కాలనీ ఎం ఐ జి లో ఇండోర్ స్టేడియం ఎంపీ భరత్ కుమార్, ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ కుమార్ మాట్లాడుతూ...
ఎమ్మెల్యే గణబాబు మాజీ క్రీడాకారుడు కావడం వలన ఈ ప్రాంతంలో క్రీడలకు ప్రాధాన్యమిస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గతంలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే ఫిర్యాదుల మేరకు ఈ ఇండోర్ స్టేడియంలో అభివృద్ధి చేయడం జరిగింది.
చుట్టుపక్కల ప్రాంతాల్లో పిల్లలకు ఉపయోగపడేలా నాలుగు బ్యాట్మెంటన్ కోర్టులు తయారు చేయడం జరిగింది.
బ్యాట్మెంటన్ కోర్టుల్లో రెండిటిని మార్పులు చేస్తూ బాక్సింగ్ కి మరియు కరాటే, కబడ్డీ లాంటి క్రీడలు కూడా నేర్పించడానికి అనుకూలంగా ఉండేలా ఈ స్టేడియం ని తయారు చేయడం జరిగింది.
ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ...
2014, 2019 ప్రాంతంలో గోపాలపట్నం, శ్రీహరిపురం ఎమ్మాజీ కాలనీలో ఇండోర్ స్టేడియం కట్టడానికి ప్రపోజల్ పెట్టాం. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కనీసం ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా అలా వదిలేయడం వల్ల స్టేడియం నిర్మాణం అవ్వటానికి దీర్ఘకాలం పట్టింది.
ప్రస్తుతం క్రీడల్లో భారతదేశం ప్రత్యేక ఘనత సాధిస్తున్నారు విదేశాల్లో పిల్లలకు ఆరు సంవత్సరాల వయసు నుంచే క్రీడల మీద ఆసక్తి కల్పిస్తూ ట్రైనింగులు ప్రారంభిస్తారు.
అదేవిధంగా భారతదేశంలో పిల్లలకు ఆరో సంవత్సరం నుంచే ట్రైనింగ్ ఇచ్చే విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా పిల్లలతో కార్యక్రమాలు ప్రారంభింపజేయడం జరిగింది.
రాష్ట్రంలో ఏవైనా క్రీడలు జరిగినప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడానికి కావచ్చు వారు ప్రాక్టీస్ చేసుకోవడానికి కావచ్చు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించే విధంగా ఈ ఇండోర్ ట్రైనింగ్ స్టేడియంని నిర్మించడం జరిగింది.




