Araku: పాలనలో ప్రధాని మోదీది చెరగని ముద్ర: డాక్టర్ దొన్ను దొర

Araku: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ పూర్తి చేసుకున్న వేళ సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అరకులో డాక్టర్ దొన్ను దొర మొక్కలు నాటారు.

REHAMAN, ARAKU
Published on: 2 Oct 2026 2:12 PM IST
Araku
X

Araku: పాలనలో ప్రధాని మోదీది చెరగని ముద్ర: డాక్టర్ దొన్ను దొర

Araku: ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పాలనలో శ్రీ నరేంద్ర మోడీ గారు చెరగని ముద్ర వేసుకున్నారని 25 వసంతాల ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా సియ్యారి దొన్ను దొర గారు శుభాకాంక్షలు తెలిపారు.

సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం సేవలో నా భాగస్వామ్యం పేరిట అరకు వేలిలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఈ మొక్కలు నాటిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

నరేంద్ర మోడీ గారు 13 ఏళ్ల ముఖ్యమంత్రిగా 12 ఏళ్ల ప్రధానమంత్రిగా ప్రజల కోసం ఆయన నిరంతరం పని చేశారన్నారు. సేవే పరమావిధిగా ఆయన తప్పించారన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఆయన పడ్డ తపన వర్ణించలేమన్నారు.

వికసిత్ భారత్ దిశగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు వేస్తున్నా అడుగులకు ప్రజలందరి సహకారం సంపూర్ణంగా లభిస్తుందన్నారు. దేశ ప్రగతిలో బలమైన బాటలు వేస్తూ మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయమన్నారు.

ఆయన జన్మదినం నాడు ప్రారంభమైన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలు నెలరోజులపాటు నిర్వహణలో తాము కూడా భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి కిలో శ్యామ్, అరకు వ్యాలీ మండల అధ్యక్షుడు లోకోయి మహాదేవ్, డుంబ్రిగూడ మండల అధ్యక్షుడు కిల్లో ఆనందరావు, జనసేన POC శెట్టి చిరంజీవి, AMC చైర్మన్ బోరి బోరి లక్ష్మి, మండల అధ్యక్షురాలు కొర్ర జ్యోతి, మాజీ సర్పంచ్ పెట్టెలి దాసుబాబు, మాజీ మండల అధ్యక్షురాలు వంతల ద్రౌపతి, బూత్ ఇన్చార్జి పాడి రుషి సుస్మిత, మాజీ ఎంపిటిసి శెట్టి వెంకట్రావు, మాజీ ఎంపిటిసి LB భీమరాజు, అనంతగిరి మండలం ఉపాధ్యక్షుడు మజ్జి భీమరాజు, అరకు వ్యాలీ మండలం ఎస్టీ సెల్ అధ్యక్షుడు పెట్టెలి రాజ్ కుమార్, ఉప సర్పంచ్ పాడి చందు నిర్మల, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిల్లో నాగరాజు, క్లస్టర్ ఇంచార్జి కొర్ర శేఖర్, మాజీ ఎంపిటిసి కిల్లో కుమార్, తహసిల్దార్ రాజ శ్రీధర్ ఎంపీడీవో ప్రసాద్, P4 అధికారి శ్రీనివాసరావు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూటమి నాయకులు, కార్యకర్తలు క్లస్టర్ ఇంచార్జ్ లు, బూత్ ఇన్చార్జిలు పంచాయతీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU