Simhachalam: అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు!
Simhachalam: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు దంపతులు; వారికి ఘన స్వాగతం పలికి ప్రసాదాలు అందజేసిన ఈవో.
Simhachalam: అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు!
Simhachalam: సింహాచలం శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ దంపతులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్సీ దంపతులు అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనానంతరం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు దంపతులను శేషవస్త్రాలతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అలాగే స్వామివారి జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ కార్య నిర్వహణ అధికారి పిల్ల శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




