Visakhapatnam: యెర్నిమాంబ అమ్మవారి ఆలయ నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం!

Visakhapatnam: జ్ఞానాపురం యెర్నిమాంబ అమ్మవారి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం.. ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 25 Sept 2026 1:11 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: యెర్నిమాంబ అమ్మవారి ఆలయ నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం!

Visakhapatnam: జ్ఞానాపురం ,యెర్నిమాంబ అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి చైర్మన్‌గా శ్రీ గణేష్‌తో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశిష్టతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా నూతన ధర్మకర్తల మండలి సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్షించారు.అమ్మవారి ఆలయానికి ధర్మకర్తలుగా బాధ్యతలు స్వీకరించడం దైవానుగ్రహంగా, గొప్ప అదృష్టంగా భావించాలని ఆయన అన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి మరింతగా కృషి చేయడంతో పాటు భక్తుల విశ్వాసానికి అనుగుణంగా సేవా కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండేలా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.యెర్నిమాంబ అమ్మవారి ఆశీస్సులతో దక్షిణ నియోజకవర్గ ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం, సుభిక్షం కలగాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వివిధ వార్డులకు చెందిన కూటమి నాయకులు, జనసేన శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలయ భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈవో సురేష్ బాబు గారు, తదితరులు పాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.