Araku: అరకులో 'యూత్ ప్లే ఫర్ పీస్' వేడుకలు - హాజరైన ఎమ్మెల్యే!
Araku: అరకు వ్యాలీలో 'యూత్ ప్లే ఫర్ పీస్' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. ప్రపంచ శాంతికి, యువతకు మంచి నడవడిక అవసరమని పిలుపు.
Araku: అరకులో 'యూత్ ప్లే ఫర్ పీస్' వేడుకలు - హాజరైన ఎమ్మెల్యే!
Araku: ఈ రోజు అరకు వ్యాలీ మండల కేంద్రంలోని నేచర్ కార్యాలయం ఆవరణంలో వైస్ మెన్ ఇంటర్నేషనల్,గ్రామీణ వికాస్,స్వాంతన ట్రస్ట్,యూఆర్ఐ ఆధ్వర్యంలో యూత్ ప్లే ఫర్ పీస్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతికి అందరి సహకారం అవసరమన్నారు. యువత పెడదారి పట్టడానికి బాల్యంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమన్నారు. పిల్లల్ని స్కూల్ కి పంపడంతో బాధ్యత తీరిందనుకుంటున్నామని,హోంవర్క్ లు కూడా తల్లిదండ్రులే చేస్తున్నారని అన్నారు.
ఏజెన్సీలో ప్రాంతంలో పిల్లలు కౌమర్ దశలోనే గంజాయి,మద్యం,సిగరెట్లకు బానిసై భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండే మంచి నడవడిక,గొప్ప వ్యక్తుల స్ఫూర్తిని పిల్లలకు నేర్పాలని,మంచిని ప్రోత్సహించి చెడును ఖండిస్తేనే శాంతి నెలకొంటుందని పిలుపునిచ్చారు.
అనంతరం పీస్ అంబాసిడర్ సర్టిఫికేట్ ను రేగం మత్స్యలింగం గారు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొ. డా. అబ్రహం కరికం గారు- URI - ఇండియా,అడ్వకేట్ రేణి జాకబ్ గారు,మిస్టర్ మత్తాయి కుట్టి గారు,ప్రొ. ఎన్. ప్రకాశ రావు గారు,డా. ప్రజ్ఞాన్ కుమార్ గారు,కె. వెంకటరావు గారు తదితరులు పాల్గొన్నారు.




