Visakhapatnam: మెడికవర్ హాస్పిటల్‌లో లంకెలపాలెం ప్రమాద బాధితుల పరామర్శ
Visakhapatnam: పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు లంకెలపాలెం ప్రమాద బాధితులను మెడికవర్ ఆసుపత్రిలో పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Visakhapatnam: మెడికవర్ హాస్పిటల్‌లో లంకెలపాలెం ప్రమాద బాధితుల పరామర్శ
Visakhapatnam: లంకెలపాలెం ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి ఆరా; సహాయం అందిస్తామని కమిటీ భరోసా లంకెలపాలెం గ్రామంలో శనివారం జరిగిన ప్రమాద ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మెడికవర్ హాస్పిటల్‌కు విచ్చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం, ఇతర సాయం అందేలా కమిటీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు సుందరపు శ్రీనివాసు, ఎస్. రామారావు, అన్నపూర్ణ శేఖర్ రెడ్డీ, కాలుష్య పోరాటం నుండి కర్రీ బుజ్జి, జోగా రాజు, తదితరులు పాల్గొన్నారు.ప్రమాద ఘటనపై స్థానికంగా వివిధ వర్గాల నుంచి సానుభూతి వ్యక్తమవుతోంది. బాధితులు త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు.




