Pendurthi: అధ్వానంగా ఉన్న రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే రమేష్ బాబు!
Pendurthi: పెందుర్తి నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను అధికారులతో పరిశీలించి, నెల రోజుల్లోగా మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు.
Pendurthi: అధ్వానంగా ఉన్న రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే రమేష్ బాబు!
Pendurthi: అసకపల్లి - లంకెలపాలెం జంక్షన్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు గుంతల తో అధ్వానంగా ఉన్న రోడ్లను ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు నాణ్యమైన రోడ్లు మెరుగైన మౌలిక వసతులే కూటమి ప్రభుత్వ సంకల్పం.
ఈరోజు 30.09.2026 తేదీన పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం అసకపల్లి నుండి పరవాడ మండలం లంకెలపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వరకు గల రోడ్డును నెలరోజుల్లోగా పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేశ్ బాబు గారు తెలిపారు.
రహదారులు మరియు భవనాల శాఖ జిల్లా అధికారులు,ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఆ రోడ్డులో పర్యటించిన ఎమ్మెల్యే భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు పూర్తిగా శిధిలమై ఉండటం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు.అలాగే ఇటీవల లంకెల పాలెం బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడటంపైనా ఆంధోళన వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు మీడియాతో మాట్లాడుతూ పైడివాడ అగ్రహారం నుండి పెదముసిడివాడ వరకు రోడ్డు నిర్మాణానికి 2. 5 కోట్లు, లంకెలపాలెం జంక్షన్ నుండి పరవాడ వరకు రోడ్డుకు 1.2 కోట్లు, లంకెలపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు పనులకు 39.90 లక్షలు నిధులు మంజూరైనాయని వెల్లడించారు. అయితే కాంగ్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రోడ్లు నిర్మాణ పనులు ఆలస్యమౌతున్నాయని, అయినా నేటి నుండే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలియచేసారు.
అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందని 16 లక్షల నిధులను వైద్యఖర్చులు కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC ) కేటాయించిందని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు గారు తెలిపారు ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసి ఆకుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేసారు.
ఈ యొక్క కార్యక్రమంలో రహదారులు మరియు భవనాల శాఖ ఉమ్మడి జిల్లా పర్యవేక్షణ ఇంజనీర్ (SE) కే జాన్ సుధాకర్ గారు, కార్య నిర్వహణ అధికారి ( EE) కె.వి రంగయ్య గారు, ఉప కార్యనిర్వాహణాధికారి ఎన్ నరసింహమూర్తి గారు, సహాయక కార్యనిర్వాహన అధికారి ( JE) లలిత గారు, బాలరాజు గారు.
రెండు మండలాల ఎంపీడీవోలు పద్మజా గారు, మల్లికార్జున గారు, మండల రెవెన్యూ అధికారులు రత్నం గారు, అరుణ్ చంద్ర గారు, సీనియర్ నాయకులు పంచకర్ల ప్రసాద్ రావు గారు, కనీస వేతనాల డైరెక్టర్ బల్రెడ్డి అప్పారావు గారు, మాజీ జెడ్పిటిసి సభ్యులు పైలా జగన్నాధ రావు గారు,మాజీ కార్పొరేటర్ రైతు శ్రీనివాసరావు గారు,మండల పార్టీ అధ్యక్షులు బొడ్డపు శ్రీనివాసరావు గారు, కర్రీ కనకరాజు గారు, మండల ఉపాధ్యక్షులు వర్రీ పరదేశి నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి ఏఎన్ఆర్ గారు, బిజెపి నాయకులు పిల్లా సతీష్ గారు.
మడక పార్వతి రమేష్ గారు,మాజీ ఎంపీటీసీ అప్పలరాజు గారు, దుర్గి నాయుడు గారు,సీనియర్ నాయకులు ఇందల రమణగారు, దుళ్ళ రాము నాయుడు గారు,బిగిడి రామ గోవింద గారు, గొన్నా రమాదేవి గారు, బలిరెడ్డి అప్పారావు గారు, సుందరపు శ్రీనివాసరావు గారు, దాసరి తాతారావు గారు,చలపాక రామారావు గారు,మోటూరు సన్యాసినాయుడు,కాకి బాబు గారు, పిల్లా శివ కృష్ణ గారు, మామిడి శంకర్రావు గారు, బంతి కోళ్ల పద్మాగారు,బొడ్డు ప్రకాష్ గారు, గవర అప్పారావు గారు, రోమాల చంద్రశేఖర్ గారు,చింతకాయల ముత్యాల గారు, మడక రమణ గారు, సింగంపిల్లి శ్రీనివాసరావు గారు, సబ్బవరపు రవి గారు,విష్ణు గారు కన్నా రావు గారు,నాగిరెడ్డి చిన్నారావు గారు,అర్జిల్లా అప్పలరాజు గారు గల్లా శ్రీనివాసరావు గారు ,వెలుగుల అనిల్ గారు, సతివాడ సత్తిరాజు గారు, పచ్చి కోర లక్ష్మీ గారు, పావని గారు తదితర రెండు మండలాల ఉమ్మడి కూటమి నాయకులు , కార్యకర్తలు మహిళలు యొక్క పర్యటన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




