Visakhapatnam: వాయుగుండం ప్రభావం గాజువాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Visakhapatnam: వాయుగుండం ప్రభావంతో గాజువాక నియోజకవర్గ ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.
Visakhapatnam: వాయుగుండం ప్రభావం గాజువాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Visakhapatnam: వాయుగుండం ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో గాజువాక నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
దిబ్బపాలెం, గంగవరం, శ్రీనగర్ మత్స్యకార కాలనీ, యారాడ తీర ప్రాంతం, పెదగంట్యాడ జాలారిపేట తదితర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని పల్లా సూచించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హితవు పలికారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారుల భద్రతపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు
తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అవసరమైన సహాయక చర్యలకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పల్లా అన్నారు. విద్యుత్, రహదారులు, తాగునీరు తదితర సేవలకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పల్లా స్పష్టం చేశారు.
ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం అందించి సహకరించాలని, అనవసరంగా బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని పల్లా విజ్ఞప్తి చేశారు.




