Anakapalli: అనకాపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!
Anakapalli: అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.
Anakapalli: అనకాపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!
Anakapalli: అనకాపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. అనకాపల్లి పట్టణంలోని భీముని గుమ్మం, కోట్నివీధి, నాయి బ్రాహ్మణ వీధి, మల్లవీధి ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, APUFIDC చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్లను పెంచి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగానే ఆయా ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ చేపట్టినట్లు పేర్కొన్నారు.
పింఛన్ అందుకున్న దివ్యాంగ లబ్ధిదారులు మాట్లాడుతూ పింఛన్ పెంపుతో తమకు ఆర్థికంగా ఎంతో భరోసా కలిగిందన్నారు. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి, ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.




