Visakhapatnam: సీఐఐ సమ్మిట్ ఒప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయి..ఎమ్మెల్యే!
Visakhapatnam: సీఐఐ సమ్మిట్ ఒప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయని, రూ.7 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు.
Visakhapatnam: సీఐఐ సమ్మిట్ ఒప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయి..ఎమ్మెల్యే!
Visakhapatnam: సీఐఐ సమ్మిట్ లో జరిగిన ఒప్పందాలు దశల వారీగా కార్యరూపం దాలుస్తున్నాయని, ఇప్పటికే రూ. 7 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ 31 వ సమ్మిట్ లో చేసుకున్న రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులతో కలిపి రెండున్నరేళ్లలో ఒప్పందాల విలువ రూ. 32.49 లక్షల కోట్లకు చేరుకుందన్నారు.
ఇంత భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు రావడానికి సీఎం చంద్రబాబు విజన్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల వేగవంతమైన నిర్ణయాలు తోడవడం కారణమని చెప్పారు. భీమిలి నియోజకవర్గం పరిధిలో గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థలు, 16 ఫైవ్ స్టార్ హోటళ్లు వచ్చే రెండు, మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయని వివరించారు.
సుస్థిర ప్రభుత్వం, నమ్మకమైన నాయకత్వంలో విశాఖ విశ్వ నగరంగా రూపాంతరం చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడులకు చట్టబద్ధత రాయితీలు ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో అకౌంట్ ప్రారంభించాలన్న సీఎం విప్లవాత్మక నిర్ణయాలు ప్రపంచ వ్యాపార సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తుందన్నారు.
సీఐఐ సమ్మిట్ ను దిగ్విజయం చేసినందుకు అభినందనలు తెలియజేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ప్రజా ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష విజయం చేకూర్చారన్నారు. విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ నియామకాల్లో తుది నిర్ణయం అధిష్టానానిదేనని, రెండు, మూడు రోజుల్లో ఈ పదవులపై స్పష్టత వస్తుందన్ని వెల్లడించారు.




