Visakhapatnam: తిరుమల వెంకన్నను దర్శించుకున్న మంత్రి నారాయణ, గంటా

Visakhapatnam: మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

SHIVA, BHIMILI
Published on: 11 Nov 2026 9:33 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: తిరుమల వెంకన్నను దర్శించుకున్న మంత్రి నారాయణ, గంటా

విశాఖపట్నం: మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తమ కుటుంబాలతో కలిసి బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని సేవించారు. గంటాకు నారాయణ, రామాంజనేయులు వియ్యంకులన్న విషయం విదితమే. తిరుమలలో జరిగిన కుటుంబ కార్యక్రమంలో వీరందరూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని స్థానిక ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిపించి ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గంటా రవితేజ, శరణి, పి.వి.ఆర్. ప్రశాంత్, జాస్తి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI