Seethammadhara: ఘనంగా మాతా అమృతానందమయి 73వ జన్మదిన వేడుకలు

Seethammadhara: విశాఖ సీతమ్మధారలో మాతా అమృతానందమయి దేవి 73వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి; ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై అమ్మ సేవలను కొనియాడారు.

SHIVA, BHIMILI
Published on: 4 Oct 2026 5:42 PM IST
Seethammadhara
X

Seethammadhara: ఘనంగా మాతా అమృతానందమయి 73వ జన్మదిన వేడుకలు

సీతమ్మధార: సద్గురు శ్రీ మాతా అమృతానందమయి దేవి 73 వ జన్మదిన వేడుకలు స్థానిక కృష్ణ మందిరంలో ఆదివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగానే కాకుండా అమృతానందమయి విద్యా సంస్థల ద్వారా విస్తృతమైన సేవలందిస్తున్నారని ప్రశంసించారు.

ఆమె జన్మదినోత్సవాన్ని విశ్వ సేవా దినంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం సంతోషమన్నారు. అందరి పట్ల ప్రేమతో మసలే అమ్మ అమరావతిలో విద్యాసంస్థ ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలని ఆకాంక్షించారు. సువిద్యామృత మాట్లాడుతూ అమృతానందమయి భక్తి, సేవా ప్రయాణాన్ని వివరించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI