Chodavaram: చోడవరం: మారుపాక ఏపీ మోడల్ స్కూల్ నూతన SMC ఎన్నిక

Chodavaram: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం మారుపాక PM SRI ఏపీ మోడల్ స్కూల్ SMC చైర్మన్‌‌గా పిల్లా గోవింద, వైస్ ఛైర్మన్‌గా కాశెట్టి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

JAGADISH BABU, CHODAVARAM
Updated on: 3 Oct 2026 5:41 PM IST
Chodavaram
X

Chodavaram: చోడవరం: మారుపాక ఏపీ మోడల్ స్కూల్ నూతన SMC ఎన్నిక

అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజకవర్గ పరిధిలోని రావికమతం మండల మారుపాక గ్రామం PM SRI ఏపీ మోడల్ స్కూల్ పాఠశాల యాజమాన్య కమిటీ (SMC / పేరెంట్స్ కమిటీ) నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలలో పాఠశాల కమిటీ చైర్మన్‌గా శ్రీ పిల్లా గోవింద, వైస్ ఛైర్మన్‌గా శ్రీ కాశెట్టి రాజు ఏకగ్రీవంగా (నూతనంగా) ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ పిల్లా గోవింద మరియు వైస్ ఛైర్మన్ కాశెట్టి రాజు మాట్లాడుతూ — "PM SRI పథకం కింద ఎంపికైన మన మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, డిజిటల్ తరగతులు, క్రీడా ప్రాంగణాలు మరియు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే మన ప్రధాన ధ్యేయం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో పాఠశాలను మోడల్ స్కూల్స్‌లోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు శ్రమిస్తాం" అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ మరియు వైస్ ఛైర్మన్‌లను పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండ నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM