Rampachodavaram: జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: జడ్జి మురళీధరరావు
Rampachodavaram: డిసెంబర్ 12న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎం. మురళీధరరావు కక్షిదారులకు పిలుపునిచ్చారు.
Rampachodavaram: జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: జడ్జి మురళీధరరావు
పోలవరం జిల్లా, రంపచోడవరం: రానున్న డిసెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మరియు మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ ఎం. మురళీధరరావు పిలుపునిచ్చారు.
రంపచోడవరం న్యాయస్థాన పరిధిలోని పోలీస్ అధికారులతో మరియు న్యాయవాదులు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.
పోలీస్ స్టేషన్ల పరిధిలో రాజీకి ఆస్కారం ఉన్న క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు (ఎంవీఏ), చెక్ బౌన్స్, సివిల్ తగాదాలు, వివాహ సంబంధిత కుటుంబ సమస్యలు తదితర కేసులను గుర్తించి, కక్షిదారులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఇరుపక్షాల కక్షిదారులకు ముందస్తు సమాచారం అందించి, కౌన్సెలింగ్ ద్వారా రాజీ కుదిర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోక్‌అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసులకు ఎటువంటి అప్పీల్ ఉండదని, దీనివల్ల సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు కోర్టులపై కేసుల భారం తగ్గుతుందని తెలిపారు.




