Madhurawada: మధురవాడ 8వ వార్డు వైసీపీ అభ్యర్థిగా పిల్లా అనిత

Madhurawada: మధురవాడ 8వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పిల్లా అనిత బరిలోకి దిగుతున్నారు. వార్డులో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారమే తన లక్ష్యమని వెల్లడించారు.

JAI RAM, MADURAWADA
Published on: 17 Oct 2026 10:05 PM IST
Madhurawada
X

Madhurawada: మధురవాడ 8వ వార్డు వైసీపీ అభ్యర్థిగా పిల్లా అనిత

మధురవాడ: 8వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కార్పొరేటర్ అభ్యర్థిగా పిల్లా అనిత పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు 8వ వార్డు నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కేకే రాజు, బొత్స అనూషలకు కృతజ్ఞతలు తెలిపారు.

మధురవాడ ప్రాంతంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ముఖ్యంగా 8వ వార్డు ప్రజలు తాగునీటి ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆమె పేర్కొన్నారు. గతంలో పాలకులు ఈ సమస్యను పట్టించుకోలేదని, మంచినీటి సమస్య పరిష్కారం కోసం తగిన స్థాయిలో పోరాటం జరగలేదని అన్నారు.

తాను కార్పొరేటర్‌గా ఎన్నికైతే 8వ వార్డులో మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా కృషి చేస్తానని పిల్లా అనిత తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, తనకు ప్రజలు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని ఆమె కోరారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA