Madhurawada: మధురవాడ జోన్-2 కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల ధర్నా!
Madhurawada: మధురవాడ జోన్-2 కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Madhurawada: మధురవాడ జోన్-2 కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల ధర్నా!
Madhurawada: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం మధురవాడ జోన్–2 కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎం.వి. ప్రసాద్, సీఐటీయూ జోన్ అధ్యక్షుడు డి. అప్పలరాజు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, మున్సిపల్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ గత నాలుగు సంవత్సరాలుగా కార్మికుల వేతనాలను సవరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మరణించిన, అనారోగ్య కారణాలతో రిటైర్ అయిన కార్మికుల వారసులను ఆప్కాస్ ద్వారా విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
కార్మికుల నుంచి చట్టవిరుద్ధంగా వసూలు చేసిన ఇన్‌కమ్ ట్యాక్స్ మొత్తాన్ని సీఐటీయూ పోరాటం ఫలితంగా అన్ని జోన్లలో తిరిగి చెల్లించినప్పటికీ, జోన్–2 కార్మికులకు మాత్రం ఇప్పటివరకు చెల్లించలేదని నాయకులు తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా సమస్య పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు.
కార్మికులకు ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జోన్–2 సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్. శేషుబాబు, జి. కిరణ్, బి. నర్సింగ్‌రావు, ఏ. నరేంద్ర, బాలు, టి. జాన్, కె. అర్జునమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.




