Madhurawada: చంద్రంపాలెం జాతరగట్టుపై ఘనంగా దసరా ఉత్సవాలు

Madhurawada: మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిచ్చారు.

JAI RAM, MADURAWADA
Published on: 11 Oct 2026 6:27 PM IST
Madhurawada
X

Madhurawada: చంద్రంపాలెం జాతరగట్టుపై ఘనంగా దసరా ఉత్సవాలు

మధురవాడ: విశాఖపట్నం జిల్లా మధురవాడ పరిధిలోని చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముందుగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించి ఆలయంలోకి తీసుకువచ్చారు. అనంతరం మధురవాడలోని మధురవనం అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న పప్పల శ్రీనివాసరావు దంపతులచే కలశ స్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ బృందం ఆధ్వర్యంలో అమ్మవారి మూలవిరాట్‌కు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి సహస్ర కుంకుమార్చనలు, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.

అలాగే సూర్య నమస్కారాలు, హోమం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, పట్నాల మూర్తి శర్మల బృందం నిర్వహించింది. సాయంత్రం కుంకుమార్చనలు, నీరాజనం, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలతో పాటు పురాణ ఇతిహాసాలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించారు.

ఉదయం నుంచే ఆలయానికి భవానీ మాలలు ధరించిన వందలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో సందడిగా మారింది. చంద్రంపాలెం వాస్తవ్యులు మానం వెంకటరావు, శారద దంపతులు, రేవల్లపాలెం వాస్తవ్యులు పోతిన అప్పలనాయుడు అందించిన సహాయ సహకారాలతో ఏర్పాటు చేసిన ప్రసాదాలను అమ్మవారికి నివేదించి, ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పిళ్లా పోతరాజు, ఎస్.ఎన్. మూర్తి, జనరల్ సెక్రటరీ నాగోతి తాతారావు, సెక్రటరీ పోతిన పైడిరాజు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, పిళ్లా వెంకటరమణ, ఉప కోశాధికారి దుక్క వరం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ, జాయింట్ సెక్రటరీలు పోతిన శివ, పోతిన ఉమామహేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గూడేల రాజు, పొట్నూరి హరికృష్ణ, మీడియా ఇన్‌చార్జి బోగవిల్లి రాము, సోషల్ మీడియా ఇన్‌చార్జి మరుపిల్లి ఆనంద్, కమిటీ సభ్యులు ఎస్.ఆర్. బాబు, పిళ్లా వెంకట అప్పారావు (రాజు), పిళ్లా సురేష్, కేశనకుర్తి అప్పారావు, గూడేల కామేశ్వరరావు, జగుపిల్లి శివకుమార్, దుర్గాశి మణికంఠ, సుందర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అలాగే గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు, పిళ్లా సత్యనారాయణ, బావిశెట్టి సత్యనారాయణ, పీస రామారావు, జగుపిల్లి నాని, ముఖ్య సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, జగుపిల్లి అప్పారావు, పోతిన వెంకటరమణ, పిళ్లా వెంకటరమణ, మానం వెంకటరావు, పోతిన శివ, జగుపిల్లి నరేష్, ఎస్. శ్రీను, రమేష్, సతీష్‌తో పాటు అమ్మవారి సేవకులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA