Madhurawada: మధురవాడలో రూ.76 వేలు పలికిన బొజ్జ గణపయ్య లడ్డూ

Madhurawada: మధురవాడ శ్రీనివాస్‌నగర్‌లో బొజ్జ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ 110 కిలోల మహాప్రసాదం లడ్డూ వేలంలో రూ.76 వేలకు వట్టికుల నాగమ్మ కైవసం చేసుకున్నారు.

JAI RAM, MADURAWADA
Published on: 28 Sept 2026 8:09 PM IST
Madhurawada
X

Madhurawada: మధురవాడలో రూ.76 వేలు పలికిన బొజ్జ గణపయ్య లడ్డూ

మధురవాడ: బొజ్జ గణపయ్య మహాప్రసాదాన్ని దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. మధురవాడ శ్రీనివాస్‌నగర్‌లో బొజ్జ గణపతి ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో 110 కిలోల లడ్డూ రూ.76 వేలకు వేలంలో పలికింది. వట్టికుల నాగమ్మ గణనాథుడి ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. అనంతరం మేళతాళాలు, బాజాభజంత్రీల నడుమ లడ్డూను ఊరేగింపుగా ఆమె ఇంటికి తీసుకెళ్లడంతో శ్రీనివాస్‌నగర్‌ వీధుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

21వ ఏడాది.. 13 రోజుల పూజలు

బొజ్జ గణపతి ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది 21వ సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలను నిర్వహించారు. 13 రోజులపాటు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల ముగింపులో ఆదివారం నిర్వహించిన అనుపు కార్యక్రమానికి కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

నాగమ్మకు ఘన సన్మానం

లడ్డూ వేలంపాట ఉత్సాహంగా సాగగా చివరకు రూ.76 వేలకు వట్టికుల నాగమ్మ మహాప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఆమెను ఉత్సవ నిర్వాహకులు సన్మానించారు. అనంతరం లడ్డూను మేళతాళాలు, బాజాభజంత్రీలతో శ్రీనివాస్‌నగర్‌ వీధుల్లో ఊరేగించి నాగమ్మ గృహానికి చేర్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకు మరింత సందడిని తీసుకొచ్చాయి.కార్యక్రమంలో జయరాం, సత్తిబాబు, చిన్నమ్మానాయుడు, మహేష్, హరీష్, సురేష్, భాష, సతీష్, శివ, సింహాచలం, సునీల్, గణేష్, రఘు, పృథ్వి, గౌతమ్, రోహిత్ తదితరులతోపాటు కాలనీ మహిళలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA