Visakhapatnam: దొంగతనం అనుమానంతో ముగ్గురిని స్తంభానికి కట్టేసిన స్థానికులు!
Visakhapatnam: విశాఖపట్నం మారికవలసలో దొంగతనానికి వచ్చారనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులను స్థానికులు పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేశారు.
Visakhapatnam: దొంగతనం అనుమానంతో ముగ్గురిని స్తంభానికి కట్టేసిన స్థానికులు!
Visakhapatnam: విశాఖ మారికవలసలో కలకలం. ముగ్గురిని విద్యుత్ స్తంభానికి కట్టేసిన స్థానికులు. దొంగతనానికి వచ్చారనే అనుమానంతో ముగ్గురిని పట్టుకున్న గ్రామస్తులు. ముగ్గురి వద్ద వన్ గ్రామ్ గోల్డ్ గాజులు, కటింగ్ బ్లేడ్, స్క్రూ డ్రైవర్ గుర్తింపు.
అనుమానితుల వద్ద సిరంజీలు, డ్రగ్స్‌కు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నట్లు సమాచారం. వారి వద్ద అనుమానాస్పద బైక్‌ను గుర్తించిన స్థానికులు. వస్తువులను చూసి ముగ్గురిని నిలదీసిన గ్రామస్తులు. అనంతరం ముగ్గురిని విద్యుత్ స్తంభానికి కట్టేసిన స్థానికులు.
సమాచారం అందుకున్న పీఎం పాలెం క్రైమ్ పోలీసులు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వన్ గ్రామ్ గోల్డ్ గాజులు, డ్రగ్స్‌కు సంబంధించిన వస్తువులు, బైక్‌పై ఆరా తీస్తున్న పోలీసులు.




