Paderu: ఘాట్ రోడ్డులో తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి: ఆదిత్య వర్మ!

Paderu: కొయ్యూరు చింతలమ్మ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ITDA PO ఆదిత్య వర్మ పరిశీలించి, రాకపోకల పునరుద్ధరణకు చర్యలు ఆదేశించారు.

SAI, PADERU
Published on: 28 Oct 2026 6:50 PM IST
Paderu
X

Paderu: ఘాట్ రోడ్డులో తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి: ఆదిత్య వర్మ!

Paderu: అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం పరిధిలోని ప్రసిద్ధ చింతలమ్మ ఘాట్ ప్రాంతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి, ప్రమాదాలుగా ఉన్న ప్రాంతాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులు, గతంలో ఎదురైన ఇబ్బందులు, ప్రయాణికుల భద్రతా చర్యలపై తహశీల్దార్, ఎస్.హెచ్.ఓ, ఎం.పి.డి.ఓ అలాగే ఎన్.హెచ్-516ఈ (NH-516E - జాతీయ రహదారి) ఎస్ డి ఆర్ ఎఫ్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించి,

పలు ఆదేశాలు జరిసేశారు .వర్షం గాలి తగ్గగానే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రవాణా భద్రత పై ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ఘాట్ రోడ్డు వెంబడి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న సున్నితమైన ప్రాంతాల్లో తక్షణమే తగిన ఇంజనీరింగ్ రక్షణ చర్యలు చేపట్టేలా, చర్యలు వేగవంతం చేయాలని నేషనల్ హైవే (NH-516E) అధికారులకు సూచించారు.

సహాయక చర్యలు అధికారులు సమన్వయంతో పర్యవేక్షించి డామేజ్ అయిన ప్రదేశాలను వెంటనే పునరుద్దించాలని అధికారులకు చూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ నిలిచిపోకుండా రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు నివారణ చర్యలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు.

ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తో పాటు కొయ్యురు మండలం తహశీల్దార్ ప్రసాద్ రావు, రెవిన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU