Kasipatnam: కాశీపట్నంలో తాగునీటి ఎద్దడి ఖాళీ బిందెలతో సీపీఎం నిరసన!

Kasipatnam: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నంలో తాగునీరు, వీధిదీపాల సమస్యలపై ఖాళీ బిందెలతో సీపీఎం నిరసన. అధికారులు తక్షణమే స్పందించాలని కాకర సింగులు డిమాండ్.

REHAMAN, ARAKU
Published on: 15 Oct 2026 6:09 PM IST
Kasipatnam
X

Kasipatnam: కాశీపట్నంలో తాగునీటి ఎద్దడి ఖాళీ బిందెలతో సీపీఎం నిరసన!

Kasipatnam: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ కేంద్రంలో 550 కుటుంబాలు కలిగిన జనాభా జీవనం కొనసాగిస్తున్నారు. కాశీపట్నం కేంద్రంలో ఉన్న గ్రామస్తులకు ఆరు నెలల నుండి త్రాగునీరు లేక నిత్యవసరాలు పనులకు నిమిత్తం పలు ఇబ్బందులు పడడంతో కాశీపట్నం గ్రామం మహిళలు సి.పి.ఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు మరమ్మత్తులకు గురైన నీళ్లు రాని వాటర్ కుళాయి స్టాపుల వద్ద ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా సి.పి.ఎం పార్టీ మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యుడు కాకర.సింగులు మాట్లాడుతూ గోస్తానీ నది ప్రక్కన ఉన్న నూ య్యి నుండి వాటర్ సప్లై అవే వాటర్ సెండ్ వద్ద ఉన్న ఆన్ అండ్ ఆఫ్ కంట్రోల్ గేటు వాలు మరమ్మత్తులకు గురై విరిగిపోవడంతో వాటర్ సప్లై అవ్వక ఆరు నెలల నుండి గ్రామస్తులకు త్రాగటానికి త్రాగునీరు అందక అనేక నిత్య అవసరాలు పనులకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామ వీధుల్లో ఎక్కడబడితే అక్కడ వాటర్ స్టాపులు కూడా మరమ్మత్తులకు గురై పాడైపోయి ఉన్నాయని అన్నారు.

గ్రామపంచాయతీ కేంద్రం కావడంతో జనాభా ఎక్కువమంది ఉన్నందున సరిపడినంతత్రాగునీరు గ్రామ ప్రజలకు సమృద్ధిగా అందలేనందున జల్ జీవన్ పథకం ద్వారా మరొక బోర్ బావి, వాటర్ ట్యాంక్ నిర్మించి రెండు సంవత్సరాలు అవుతున్న నేటికీ గ్రామస్తులకు త్రాగునీరు కొరకు అందుబాటులోకి లోచలేదని ఆరోపణ చేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పంచాయితీ కార్యదర్శి, పంచాయితీ ప్రత్యేక అధికారి వారు ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలో సందర్శించి మరమ్మత్తులకు గురైన కులాయి వాటర్ స్టాపులు, ఆన్ అండ్ ఆఫ్ కంట్రోల్ గేటు వాలు, వాటర్ సప్లై పైపులు మొదలగు వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మరమ్మతులకు గురైన వాటిని మరమ్మత్తులు చేయించి త్రాగునీరు సమస్యపై కాశీపట్నం గ్రామస్తులకు త్రాగునీరు కోసం భవిష్యత్తులో కొరత ఏర్పడకుండా త్రాగునీరు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగాఅధికారులు తగు చర్యలు తీసుకుంటారని కోరారు.

అలాగే గ్రామ పంచాయతీకి చెందిన వివిధ గ్రామాలు తుప్పలు, చెట్లు పొదళ్ళు, ఒడ్డు అవతల ఒడ్డు ఈవతల లోయల్లో భౌగోళిక పరిస్థితులను బట్టి గ్రామాలు ఉన్నాయని తెలిపారు. కొన్ని నెలల నుండి గ్రామాలలో వీధి దీపాలు లేక వివిధ గ్రామాలు కారు చీకట్లో అంద కారంగా ఉన్నాయని రాత్రి వేళల్లో అత్యవసర పనులు నిమిత్తం బయటికి వెళ్లి రావాలన్నా, అత్యవసర సమయంలో బహిర భూమికి వెళ్లాలన్నా గ్రామాలు చీకటి మయంగా ఉండడం వలన గ్రామాల్లో ఉన్న ప్రజలు విష సర్పాలకు, విష కీటకాలకు గురయ్యే ప్రమాదాలు జరుగుతాయని భయాందోళన చెందుతున్నారు.

కావున గ్రామ సచివాలయం కార్యదర్శి వారు గ్రామాలలో వీధి దీపాలు వేసే విధంగా చర్యలు తీసుకుంటారని పలు గ్రామాల ప్రజలు కోరుచున్నారు. లేనియెడల పంచాయతీ ప్రజలతో గ్రామసచివాలయం వద్ద ఆందోళన నిరసన కార్యక్రమం చేపడతామని మరియు గ్రామపంచాయతీ ప్రజలతో సంతకాల సేకరణ చేసి ప్రజావాణి( పి.జి.ఆర్. ఎస్) లో కలెక్టర్ వారికి గ్రామపంచాయతీ ప్రజలతో కలసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU