Kasimkota: కశింకోటలో మోసం, ఫోర్జరీ కేసు: ఇద్దరికి 12 రోజుల రిమాండ్
Kasimkota: కశింకోట స్థల వివాదంలో నకిలీ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి అనకాపల్లి కోర్టులో హాజరుపరచగా 12 రోజుల రిమాండ్ విధించారు.
Kasimkota: కశింకోటలో మోసం, ఫోర్జరీ కేసు: ఇద్దరికి 12 రోజుల రిమాండ్
కశింకోట: కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న స్థల వివాదానికి సంబంధించిన మోసం, ఫోర్జరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని అనకాపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 12 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
స్థల వివాదానికి సంబంధించి కోర్టు నుంచి అందిన ఎండార్స్‌మెంట్ పిటిషన్‌పై కశింకోట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, కశింకోట తహసీల్దార్ కార్యాలయ అధికారులు, కశింకోట పంచాయతీ కార్యాలయ అధికారులు, ఇతర ముఖ్య సాక్షులను పోలీసులు విచారించారు.
సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నకిలీ, ఫోర్జరీ పత్రాలను ఉపయోగించి బాధితుడిని, ప్రభుత్వ సంస్థలను మోసం చేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. ఈ ఆధారాల మేరకు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
అరెస్టు చేసిన పెంటకోట నాయుడు @ ప్రకాష్, పెంటకోట సత్యనారాయణ @ సత్తిబాబులను అనకాపల్లి కోర్టులో హాజరుపరచగా, కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి ఇద్దరికీ 12 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
మోసం, ఫోర్జరీ, ఫోర్జరీ పత్రాలను ఉపయోగించి ప్రభుత్వ సంస్థలను మోసం చేయడం వంటి ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
కశింకోట సీఐ అల్లు స్వామి నాయుడు పర్యవేక్షణలో ఎస్‌ఐ కె. లక్ష్మణరావు దర్యాప్తు నిర్వహించారు.




