Visakhapatnam: పవన్ కళ్యాణ్‌కు కందుల నళిని దేవి కృతజ్ఞతలు
Visakhapatnam: జీవీఎంసీ 43వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా బీ-ఫారం అందుకున్న శ్రీమతి కందుల నళిని దేవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వంశీకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు.
Visakhapatnam: పవన్ కళ్యాణ్‌కు కందుల నళిని దేవి కృతజ్ఞతలు
విశాఖపట్నం: GVMC 43వ వార్డు కార్పొరేటర్ ఎన్నికల్లో జనసేన–కూటమి అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీ-ఫారం అందుకున్న సందర్భంగా శ్రీమతి కందుల నళిని దేవి గారు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి, కూటమి నాయకులకు, జనసేన నాయకులకు, జనసైనికులకు, వీర మహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారు మాట్లాడుతూ, 43వ వార్డు ప్రజల ఆశీస్సులతో వార్డు అభివృద్ధికి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
తమపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల ఆదరాభిమానాలతో ప్రజాసేవలో ముందుకు సాగుతామని డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారు, శ్రీమతి కందుల నళిని దేవి గారు తెలిపారు.




