Anakapalli: మానవత్వం చాటుకున్న జనసేన నాయకుడు జెర్రిపోతుల నానాజీ!
Anakapalli: చోడవరంలో రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్న జనసేన సీనియర్ నేత జెర్రిపోతుల నానాజీ. బాధితుడికి అండగా నిలిచారు.
Anakapalli: మానవత్వం చాటుకున్న జనసేన నాయకుడు జెర్రిపోతుల నానాజీ!
Anakapalli: రోడ్డు ప్రమాద బాధితుడిని ఆదుకుని మానవత్వం చాటుకున్న జనసేన సీనియర్ నాయకులు జెర్రిపోతుల నానాజీ మానవత్వమే మన తత్వం!
నిన్న వెంకన్నపాలెం సమీపంలో జరిగిన అత్యవసర పరిస్థితిలో జనసేన సీనియర్ నాయకులు జెర్రిపోతుల నానాజీ తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలబడ్డారు. ఇదే జనసైనికుడి లక్షణం.........
చోడవరం నుంచి వెంకన్నపాలెం వెళ్లే దారిలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బైక్ వ్యక్తిని జనసేన సీనియర్ నాయకులు జెర్రిపోతుల నానాజీ తక్షణమే ఆదుకుని తన మానవత్వాన్ని చాటుకున్నారు.
అదే దారిలో వెళ్తున్న నానాజీ గారు ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడి వద్దకు వెళ్లారు. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించడంతో పాటు, బాధితుడి కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆలస్యం చేయకుండా అంబులెన్స్ ద్వారా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉందని తెలుసుకుని, హాస్పిటల్ కు సైతం స్వయంగా వెళ్లి బాధితుడిని పరామర్శించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూశారు.
ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి హాస్పిటల్ లో చేర్పించే వరకు అన్ని బాధ్యతలను నానాజీ గారే స్వయంగా చూసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, "ఇలాంటి అత్యవసర సమయంలో చాలామంది చూస్తూ వెళ్లిపోతారు, కానీ నానాజీ గారు మాత్రం ఒక కుటుంబ సభ్యుడిలా అండగా నిలబడ్డారు. ఇది నిజమైన జనసేన స్ఫూర్తి" అని కొనియాడారు.
జనసేన అంటేనే సేవ అని, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడమే తమ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయమని నానాజీ గారు తెలిపారు.




