Anakapalli: ఉమ్మడి విశాఖ కూటమి సమన్వయ భేటీ: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం

Anakapalli: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అనకాపల్లిలో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ కూటమి సమన్వయ సమావేశం నిర్వహించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 26 Sept 2026 2:22 PM IST
Anakapalli
X

Anakapalli: ఉమ్మడి విశాఖ కూటమి సమన్వయ భేటీ: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం

అనకాపల్లి: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి నేతలు విస్తృతంగా చర్చించారు. అనకాపల్లి జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఈ సమన్వయ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహరచన, కూటమి అభ్యర్థుల విజయానికి టీడీపీ, జనసేన నేతలు సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు.

అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధానంపైనా నేతలు చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంచుకుని ఎన్నికలకు సిద్ధం కావాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు.

ఈ సమావేశానికి జనసేన, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. పంచకర్ల రమేష్, వంశీకృష్ణ యాదవ్, కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్‌కుమార్, బండారు సత్యనారాయణ, చింతకాయల రాజేష్ తదితరులు పాల్గొని ఎన్నికలకు సంబంధించిన అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగినట్లు నాయకులు తెలిపారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI