Narsipatnam: 'జయహో బీసీ' నినాదాలతో హోరెత్తిన నర్సీపట్నం
Narsipatnam: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయించడంపై నర్సీపట్నంలో లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
Narsipatnam: 'జయహో బీసీ' నినాదాలతో హోరెత్తిన నర్సీపట్నం
నర్సీపట్నం: బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కేటాయించినందుకు నారచంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నర్సీపట్నం టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా బాణసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా వారు చేసిన "జయహో బీసీ" నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు, మరియు యువత అత్యుత్సాహంగా పాల్గొన్నారు.




