Chintoor: ముకునూరులో జనసేన జోష్.. సర్పంచ్ బరిలో యువకుడు నాగరాజు!

Chintoor: చింతూరు మండలం ముకునూరు సర్పంచ్ ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా పాయం నాగరాజు బరిలోకి దిగారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 22 Nov 2026 9:31 AM IST
Chintoor
X

Chintoor: ముకునూరులో జనసేన జోష్.. సర్పంచ్ బరిలో యువకుడు నాగరాజు!

Chintoor: చింతూరు మండలం ముకునూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా సర్పంచ్ స్థానం జనసేనకు కేటాయించడం గ్రామంలో హాట్ టాపిక్‌గా మారింది. జనసేన తరఫున యువకుడు, ఉత్సాహవంతుడు పాయం నాగరాజును బరిలో దించారు.

నాగరాజు పేరు ప్రకటించిన క్షణం నుంచే గ్రామంలో ఎన్నికల వేడి రెట్టింపు అయింది. నాగరాజు కేవలం అభ్యర్థి మాత్రమే కాదు, గ్రామస్తులకు సుపరిచితుడైన యువకుడు. మంచి ప్రవర్తన, అందరితో కలివిడిగా ఉండే తత్వం, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే మనస్తత్వం ఆయనకు గ్రామంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

యువతలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్, పెద్దల్లో ఉన్న గౌరవం ఈ ఎన్నికల్లో ఆయనకు పెద్ద బలంగా మారనున్నాయి. కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ ఏకతాటిపైకి వచ్చి నాగరాజు గెలుపు కోసం ప్రచారంలో దూసుకుపోతున్నారు. “యువకుడు వస్తేనే గ్రామం మారుతుంది, అభివృద్ధి వేగంగా జరుగుతుంది” అని గ్రామస్తులు అంటున్నారు.

తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, యువతకు ఉపాధి, గ్రామ అభివృద్ధి వంటి అంశాలపై నాగరాజు ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ప్రత్యర్థులు ఎవరైనా సరే, నాగరాజు విజయం ఖాయమని కూటమి శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముకునూరులో ఈసారి యువతరం జెండా ఎగురడం ఖాయమని గ్రామంలో చర్చ జోరుగా సాగుతోంది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR