Paderu: గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుండి పెట్రోల్ బంకుల దరఖాస్తులు ఆహ్వానం!
Paderu: అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని పెట్రోల్ బంకుల నిర్వహణకు గిరిజన యువత నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ తెలిపారు.
Paderu: గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుండి పెట్రోల్ బంకుల దరఖాస్తులు ఆహ్వానం!
Paderu: సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐ.టి.డి.ఎ),అనంతగిరి, లుంగాపుట్టు (ముంచింగిపుట్టు),పిట్టచలం(కొయ్యూరు) గ్రామంలో నెలకొల్పిన హెచ్.పి.సి.ఎల్ పెట్రోలు పంపుల నిర్వహణ కొరకు గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐ.టి.డి.ఎ),పాడేరు ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
అల్లూరి జిల్లా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐ.టి.డి.ఎ),పాడేరు పరిదిలో గల స్థానిక గిరిజనులై తప్పనిసరిగా డిగ్రి అర్హత పొందిన, యువతి, యువకులు ఈ ధరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.ఈ కార్యక్రమం ముత్తం లాటరి పద్దతిలో ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎంపిక కాబడిన లీజుదారుడు పూర్తిగా నిర్వహణ కొరకు పెట్టుబడి పెట్టుకొవలసి ఉంటుంది.ముందుగా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐ.టి.డి.ఎ),పాడేరు వారికి నిబంధనల ప్రకారం కొంత నగదు డిపాజిట్ చెల్లించాలి,అదేవిధంగా ప్రతి నెల అద్దె నిమిత్తం ఐ.టి.డి.ఎ, పాడేరు వారికి చెల్లించి పెట్రోలు బంక్ నిర్వహణ చేసుకోవలసి ఉంటుంది.
దరఖాస్తు కొరకు ప్రాజెక్ట్ అధికారి ఐ.టి.డి.ఏ., పాడేరు వారి పేరు మీదుగా రూ.5000/-(అక్షరముల ఐదు వేలు రూపాయలు)డిమాండ్ డ్రాఫ్ట్(డిడి)ని ఇచ్చి ధరఖాస్తు పొందగలరు.అలాగే ధరఖాస్తు చేసుకోనె అభ్యర్ధి ధరఖాస్తుతో పాటు రూ.1,00,000/-(ఒక్క లక్ష రూపాయలు)బ్యాంకు డిమాండ్ డ్రాపుట్ (డిడి) EMD ఇవ్వవలసి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఎంపిక కాని అభ్యర్ది యోక్క డిమాండ్ డ్రాపుట్ (డిడి) EMD తిరిగి ఇవ్వబడును. ఆసక్తిగల వారు 21.09.2026 నుండి 28.09.2026 సాయంత్రం 5 గంటల వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్దుల ఎంపిక 01.10.2026న ఉదయం 11 గంటలకు లాటరీ పద్దతిలో ఎంపిక చేయబడును. ధరఖాస్తులు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐ.టి.డి.ఎ),పాడేరు వారికీ కార్యక్రమం నాకు సమర్పించవలెను. ఇతర వివరాలు కొరకు 9440972048 ఈ ఫోన్ నెంబర్ కు సంప్రదించాలన్నారు.




