Anakapalli: ప్రధాన రహదారిపై పారుతున్న వర్షపు నీరు.. 5 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం!

Anakapalli: అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో తుఫాను వర్షాల బీభత్సం. కేఎన్ఆర్ పేట హైవే నుంచి రాజుపాలెం వెళ్లే రహదారి నీటమునగడంతో 5 గ్రామాల ప్రజల రాకపోకలు స్తంభన.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 28 Oct 2026 12:23 PM IST
Anakapalli
X

Anakapalli: ప్రధాన రహదారిపై పారుతున్న వర్షపు నీరు.. 5 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం!

Anakapalli: అనకాపల్లి జీవీఎంసీ పరిధిలోని విలీన గ్రామాల్లో వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేఎన్ఆర్ పేట హైవే నుంచి రాజుపాలెం సహా విలీన గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వర్షాల ప్రభావంతో రహదారిపై నీరు పెద్దఎత్తున చేరి, ఎత్తుగా ప్రవహిస్తుండటంతో సుమారు ఐదు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సిన వారు సైతం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది.

ప్రతి వర్షాకాలంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి, సహాయక చర్యలు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విలీన గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజల ఇబ్బందులపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? రహదారిపై నీటి ప్రవాహానికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI