Anakapalli: అనకాపల్లిలో ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’ ప్రచారం!
Anakapalli: అనకాపల్లి AMC కాలనీలో ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’: నియోజకవర్గంలో ₹1300 కోట్ల అభివృద్ధి పనులను వివరించిన నేతలు, కాలనీలో పలు అభివృద్ధి పనుల వివరాల వెల్లడి.
Anakapalli: అనకాపల్లిలో ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’ ప్రచారం!
అనకాపల్లి: పట్టణంలోని 112వ డివిజన్ (పాత 83వ డివిజన్) AMC కాలనీలో “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” ప్రచార కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ చొరవతో అనకాపల్లి నియోజకవర్గంలో రూ.1,300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
AMC కాలనీలో రూ.75 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనం, రూ.20 లక్షలతో మినీ వాటర్ ట్యాంక్, రూ.15 లక్షలకు పైగా నిధులతో డ్రైనేజీ కాలువల నిర్మాణం, పిల్లల కోసం చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు పనులు చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వ అపార్ట్మెంట్లలో నివసిస్తున్న అర్హులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ హాస్పిటల్ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు, దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్, TNTUC ఉపాధ్యక్షుడు పిట్ల రాజు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బర్నికాన రాంబాబు, జనసేన నాయకుడు దొడ్డి రాము, టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ ఎస్. భాను చందర్ (అఖి), వార్డు మహిళా అధ్యక్షురాలు బొమ్మల దేవి, నీలాపు పండు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




