Anakapalli: అనకాపల్లి రాజకీయాల్లో రిజర్వేషన్ల హీట్ - ఆశావహుల్లో ఉత్కంఠ!

Anakapalli: అనకాపల్లి జోన్-10లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై జోరుగా చర్చ. ఎస్సీ మరియు మహిళా రిజర్వేషన్లపై ఆశావహుల్లో పెరుగుతున్న టెన్షన్.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 26 Sept 2026 12:13 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి రాజకీయాల్లో రిజర్వేషన్ల హీట్ - ఆశావహుల్లో ఉత్కంఠ!

Anakapalli: అనకాపల్లి రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చలు ఆశావహుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. ముఖ్యంగా ఒకవైపు ఎస్సీ రిజర్వేషన్‌పై చర్చ సాగుతుండగా.. మరోవైపు మహిళా రిజర్వేషన్ అంశం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అనకాపల్లి జోన్‌-10 పరిధిలో ప్రస్తుతం ఆరు వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్సార్‌సీపీ తదితర పార్టీల నుంచి పలువురు ఆశావహులు తమకు అవకాశం దక్కుతుందనే ఆశతో రాజకీయంగా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. జోన్‌-10లోని కొన్ని వార్డులకు మహిళా రిజర్వేషన్‌ వస్తే పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపై కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు పురుష ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. మహిళా రిజర్వేషన్‌ అమల్లోకి వస్తే వారి కుటుంబాల నుంచి మహిళలను బరిలోకి దింపుతారా? లేక కొత్తగా మహిళా నేతలు తెరపైకి వస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారానికి అధికారిక రిజర్వేషన్‌ ప్రకటన, అభ్యర్థుల తుది జాబితా వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో జోన్‌-10లో రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. చివరకు ఏ వార్డు ఏ వర్గానికి, ఏ వర్గానికి చెందిన మహిళలకు దక్కుతుందన్నది తేలాల్సి ఉంది.

రిజర్వేషన్ల ప్రకటన వెలువడిన తర్వాత అనకాపల్లి రాజకీయ సమీకరణాలు మరింత మారే అవకాశం ఉందన్న చర్చ స్థానిక రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI