Gajuwaka: గాజువాక 100వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బొండా ఎల్లాజీరావుకు బ్రహ్మరథం!
Gajuwaka: గాజువాక 100వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బొండా ఎల్లాజీరావు ఇంటింటి ప్రచారం. కప్పు సాసర్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరిన వాకర్స్ అసోసియేషన్.
Gajuwaka: గాజువాక 100వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బొండా ఎల్లాజీరావుకు బ్రహ్మరథం!
Gajuwaka: గాజువాక ఎన్నికల ప్రచారంలో భాగంగా 100 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బొండా ఎల్లాజీరావుకు యధావిధిగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, రాయల్ చెరువు,రాజీవ్ నగర్ మార్కెట్,లక్కరాజు వారి పాలెం ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలచెరువు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు బొమ్మిశెట్టి భాస్కరరావు అధ్యక్షతన పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ముఖ్యంగా స్టీల్ ప్లాంటు పరిరక్షణ కొరకు స్టీల్ కోఆపరేటివ్ స్టోర్స్ అభివృద్ధి కొరకు అదేవిధంగా రాయల్ చెరువు అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలో ఉన్న మురికివాడల ప్రజల సమస్యలపై ఎన్నో పోరాటాలు సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి బొండా యల్లాజీరావు దంపతులకు మనం కప్పు సాసర్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఎ యల్లాజీ రావు దంపతులను ఘనంగా సన్మానం చేశారు.దీనిపై స్పందిస్తూ గత నలభై ఏళ్లుగా నేను మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యునిగా ఉంటూ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఎటువంటి అధికారిక పదవులు లేకపోయినప్పటికీ చేయడం జరిగిందని అదే మీ ఓటు అనే వజ్రాయుధం ఉపయోగించి అఖండ మెజారిటీతో నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత రూపురేఖలే మార్చేస్తానని గ్రేటర్ విశాఖపట్నంలో ఉన్న అన్ని వార్డుల కంటే ఆదర్శ వార్డుగా స్మార్ట్ వార్డుగా అభివృద్ధి చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో 100వ వార్డుని అగ్రగామిగా నిలబెడతానని ప్రమాణం చేస్తున్నాను.అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజలు ఇన్నాళ్లు పడిన ఇక్కట్ల నుండి విముక్తి చేస్తానని రాజీవ్ నగర్ ప్రాంతమంతా కూడా గోతులమయం పాములు తో ఎటువంటి విద్యుత్తు దీపాలు కూడా లేకుండా బిక్కు బిక్కు మంటూ ప్రజలు జీవనం సాగిస్తున్నారని ఈ పరిస్థితి నుండి వార్డులోనే రాజీవ్ నగర్ ను అన్ని సౌకర్యాలతో పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో యోగా గురువు ఉగ్రసేనరావు, ముత్యాల నాయుడు,నంబారు అమ్మన్న,పవన్, మూర్తి, బాలం ప్రకాష్,భరత్, చింతల శ్రీనివాస్,మోహన్ రావు,దివాకర్,సూర్యనారాయణ,ఈశ్వరరావు, సుంకర శ్రీనివాస్,రాంబాబు, గంగాభవాని,శ్యామల, ఉదయ, శ్రీదేవి, సూరిబాబు, బోండా గోవిందరాజు, సామోజు అప్పలరాజు,మల్ల దిలీప్ కుమార్,బంటు ఈశ్వరరావు, బంగారు రాజు, సాంసంగ్ సురేష్,సంతోష్ కుమార్ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.




