Nakkapalli: నక్కపల్లి కేజీబీవీ సమీప కాలనీలో హోంమంత్రి పర్యటన!

Nakkapalli: భారీ వర్షంతో నీటమునిగిన నక్కపల్లి కేజీబీవీ సమీప కాలనీని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని కాలనీవాసులకు భరోసా.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 31 Oct 2026 10:10 AM IST
Nakkapalli
X

Nakkapalli: నక్కపల్లి కేజీబీవీ సమీప కాలనీలో హోంమంత్రి పర్యటన!

Nakkapalli: నక్కపల్లి కేజీబీవీ సమీప కాలనీలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నీరు చేరి ముంపునకు గురైన ప్రాంతాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. కాలనీలోకి చేరిన వర్షపు నీటిని స్వయంగా పరిశీలించిన మంత్రి, స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వర్షపు నీరు నిల్వ ఉండటంతో కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న హోంమంత్రి, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు చేపడతామని, కాలనీలో తాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

పర్యటన మార్గమధ్యంలో పలువురి ఇళ్లకు వెళ్లిన మంత్రి అనిత, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి పేర్కొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.