S Rayavaram: కొత్త పోలవరం రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత

S Rayavaram: ఎస్.రాయవరం మండలం కొత్త పోలవరం వద్ద రోడ్డు ప్రమాద స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించి, నక్కపల్లి ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు.

RAJU, PARAYAKARAOPETA
Published on: 14 Nov 2026 2:05 PM IST
S Rayavaram
X

S Rayavaram: కొత్త పోలవరం రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత

ఎస్.రాయవరం: కొత్త పోలవరం వద్ద రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి వంగలపూడి అనిత. ప్రమాదం జరిగిన తీరును మంత్రికి వివరించిన పోలీసు అధికారులు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న హోం మంత్రి అనిత. అనంతరం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న మంత్రి.

నక్కపల్లి ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన హోం మంత్రి అనిత. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన మంత్రి. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం: హోం మంత్రి అనిత. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి అనిత.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన హోం మంత్రి అనిత.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA