Visakhapatnam: ‘కమిటీ కుర్రోళ్లు’ సహ నిర్మాత ఫణి అడపాకకు హోంమంత్రి సత్కారం!
Visakhapatnam: 72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన ‘కమిటీ కుర్రోళ్లు’: సహ నిర్మాత ఫణి అడపాకను ఘనంగా సత్కరించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, చిత్ర బృందానికి అభినందనలు.
Visakhapatnam: ‘కమిటీ కుర్రోళ్లు’ సహ నిర్మాత ఫణి అడపాకకు హోంమంత్రి సత్కారం!
విశాఖపట్నం, సెప్టెంబర్ 27: ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా సహ నిర్మాత ఫణి అడపాకను ఆదివారం విశాఖపట్నం ఎంవీపీ నివాసం వద్ద రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఘనంగా సత్కరించి, ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ మేకప్ విభాగాల్లో అవార్డులు సాధించడం పట్ల హోంమంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు సినిమా రంగంలో మంచి కథాంశంతో రూపొందిన ‘కమిటీ కుర్రోళ్లు’ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణమని అనిత పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫణి అడపాక, చిత్ర బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి ఫణి అడపాక సహ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించారు.




