Anakapalle: నూకాంబికా అమ్మవారి ఆలయంలో హోం మంత్రి అనిత సందడి!

Anakapalle: అనకాపల్లి శ్రీ నూకాంబికా అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన హోం మంత్రి అనిత.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 4 Oct 2026 10:51 AM IST
Anakapalle
X

Anakapalle: నూకాంబికా అమ్మవారి ఆలయంలో హోం మంత్రి అనిత సందడి!

Anakapalle: అనకాపల్లి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నూకాంబికా అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర హోం మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నూకాంబికా ఆలయానికి చేరుకున్న హోం మంత్రి అనితకు స్థానిక నాయకులు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు హోం మంత్రి అనితకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని ఆమెకు బహూకరించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి అనితతో పాటు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ నూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI