Sabbavaram: సబ్బవరంలో నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభించిన హోంమంత్రి అనిత!
Sabbavaram: అనకాపల్లి జిల్లా సబ్బవరంలో రూ.1.60 కోట్లతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు.
Sabbavaram: సబ్బవరంలో నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభించిన హోంమంత్రి అనిత!
Sabbavaram: అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం పర్యటించారు. సబ్బవరంలో రూ.1.60 కోట్ల వ్యయంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని హోం మంత్రి అనిత ప్రారంభించారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రంలోని వివిధ గదులను హోంమంత్రి పరిశీలించారు. నూతన అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించి, వివిధ అగ్నిమాపక పరికరాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అగ్నిమాపక కేంద్రం ప్రాంగణంలో హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఏపీ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ సబ్బవరం తన సొంతూరు కావడంతో ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని అభినందించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఫైర్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
బుడమేరు వరదల సమయంలో ఫైర్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిసరాలను శుభ్రం చేయడంలో కీలకంగా సేవలందించారని గుర్తుచేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అనేక నూతన అగ్నిమాపక కేంద్రాలను నిర్మించడంతో పాటు పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తమ సత్తా చాటాలని ఆమె పిలుపునిచ్చారు.




