Paderu: అల్లూరి మన్యంలో భారీ వర్షాలు - అన్ని పాఠశాలలకు సెలవు!
Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు. వాగులు, వంకలు పొంగిప్రవహిస్తుండడంతో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్.
Paderu: అల్లూరి మన్యంలో భారీ వర్షాలు - అన్ని పాఠశాలలకు సెలవు!
Paderu: బంగాళాఖాతం లో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అల్లూరి ఏజెన్సీలో విస్తారమైన వర్షాలు కురుస్తుండడంతో మన్యంలో అనేక ప్రాంతాల్లో పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు దీంతో అనేక గిరిజన గ్రామాలకు ప్రజా సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఏర్పడడంతో అల్లూరి జిల్లా కలెక్టర్ నిశాంతి జిల్లా యంత్రాంగని అప్రమత్తం చేసి మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు వాయుగుండం ప్రభాత ప్రాంతాలను జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలన చేసి తగు సూచనలు అధికారులకు చేస్తున్నారు.
గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అన్ని పాఠశాలకు సెలవును ప్రకటించారు.




