Madhurawada: జీవీఎంసీ 7వ వార్డులో కూటమి అభ్యర్థి మహేశ్వరి ప్రచారం!
Madhurawada: జీవీఎంసీ 7వ వార్డు జనసేన అభ్యర్థి దేవర మహేశ్వరికి మద్దతుగా శారద నగర్, మారికవలసలో కూటమి నాయకులు మొల్లి లక్ష్మణరావు, నమ్మి శ్రీను విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేశారు.
Madhurawada: జీవీఎంసీ 7వ వార్డులో కూటమి అభ్యర్థి మహేశ్వరి ప్రచారం!
మధురవాడ: జీవీఎంసీ 7వ వార్డులో కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి దేవర మహేశ్వరికి మద్దతుగా టీడీపీ సీనియర్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో సోమవారం శారద నగర్, మారికవలస జంక్షన్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుకు ఓటు వేసి దేవర మహేశ్వరికి మద్దతు తెలపాలని కోరారు.
ఈ సందర్భంగా మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ 7వ వార్డు సమగ్ర అభివృద్ధికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాన్యులకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించేందుకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
టీడీపీ నాయకుడు నమ్మి శ్రీను మాట్లాడుతూ శారద నగర్, మారికవలస ప్రాంతాల్లో ప్రజలను కలిసి వార్డు అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించామని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




