Gajuwaka: వివాదాస్పద కోటి గాజుల వినాయక పందిరి చుట్టూ ఉన్న కమర్షియల్ స్టాల్స్ తొలగింపు!
Gajuwaka: గాజువాకలో ఎలాంటి అనుమతులు లేకుండా కోటి గాజుల వినాయక పందిరి చుట్టూ ఏర్పాటు చేసిన కమర్షియల్ స్టాల్స్‌ను తొలగించిన జీవీఎంసీ సిబ్బంది.
Gajuwaka: వివాదాస్పద కోటి గాజుల వినాయక పందిరి చుట్టూ ఉన్న కమర్షియల్ స్టాల్స్ తొలగింపు!
Gajuwaka: గాజువాకలో వివాదాస్పదంగా మారిన కోటి గాజుల వినాయక విగ్రహ పందిరి చుట్టూ ఉన్న కమర్షియల్ స్టాల్స్ ను జీవీఎంసీ సిబ్బంది ఎట్టకేలకు ఈరోజు తొలగించారు.
గత కొంతకాలంగా కోటి గాజుల గణపతి నిర్వాహకులు దేవుడి పేరు చెప్పి మండపం చుట్టూ కమర్షియల్ స్టార్స్ ఏర్పాటు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్న ఫిర్యాదులపై దృష్టి సాగించిన జీవీఎంసీ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ సిబ్బంది కలిసి చేసిన జాయింట్ ఇన్స్పెక్షన్ లో స్టాల్స్కు గాని వినాయక పందిరికి గాని ఎటువంటి అనుమతులు లేకపోవడంతో నిర్వాహకులకు సిబ్బందికి వాగ్వాదం ఏర్పడింది.
వినాయక పందిరి వరకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ట్రాఫిక్ దృశ్య ప్రజల సౌకర్యం కొరకు ఈ కమర్షియల్ స్టాల్స్ ను రెండు రోజుల్లో తొలగించాలని అధికారులు ఆదేశించినప్పటికీ పట్టించుకోని నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి ఈరోజు అన్ని స్టాల్స్ లు తొలగించారు.
వినాయక చవితికి ఏ దేవుడు కార్యక్రమానికి తాము ఎప్పుడూ అభ్యంతరాలు తెలపలేదని దేవుడి పేరుతో వ్యాపారం చేస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న నిర్వాహకులు పై కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.




