Bheemili: భీమిలి పోలీస్ – ఎన్నికల అవగాహన సమావేశం
Bheemili: జీవీఎంసీ 5వ వార్డు చేపల ఉప్పాడలో సీఐ దివాకర్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్థుల సమావేశం. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని పిలుపు.
Bheemili: భీమిలి పోలీస్ – ఎన్నికల అవగాహన సమావేశం
భీమిలి: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో చేపల ఉప్పాడ 5వ వార్డులో భీమునిపట్నం పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ దివాకర్ యాదవ్ గారు సుమారు 200 మంది గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని, ఎటువంటి గొడవలు, శాంతిభద్రతల సమస్యలకు తావివ్వకూడదని సూచించారు.
ఎన్నికల సమయంలో నిబంధనలు ఉల్లంఘించి గొడవలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ ప్రజలందరూ శాంతియుత ఎన్నికలకు సహకరిస్తామని సీఐ గారికి హామీ ఇచ్చారు.




