Madhurawada: మారికవలసలో వైఎస్సార్‌సీపీ గడపగడపకు ప్రచారం!
Madhurawada: జీవీఎంసీ 7వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పోతిన జాహ్నవి మారికవలస, శివశక్తి నగర్‌లో గడపగడపకు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Madhurawada: మారికవలసలో వైఎస్సార్‌సీపీ గడపగడపకు ప్రచారం!
మధురవాడ: జీవీఎంసీ 7వ వార్డులో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పోతిన జాహ్నవి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. శివశక్తి నగర్, శ్రీ లక్ష్మీనగర్, మారికవలస, శారదానగర్ ప్రాంతాల్లో వైసీపీ సీనియర్ నాయకుడు బాగాది లక్ష్మణ్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోతిన జాహ్నవి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పలుచోట్ల స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు, యువత ప్రచారంలో పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా బాగాది లక్ష్మణ్ మాట్లాడుతూ, పోతిన జాహ్నవిని గెలిపిస్తే వార్డు అభివృద్ధికి మరింత కృషి చేస్తారని పేర్కొన్నారు. పోతిన జాహ్నవి మాట్లాడుతూ, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్‌లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




