Bheemili: 7వ వార్డు అభివృద్ధే ధ్యేయం: కూటమి అభ్యర్థి బోయి రమాదేవి!

Bheemili: జీవీఎంసీ 7వ వార్డు కూటమి అభ్యర్థిగా బోయి రమాదేవి బరిలోకి దిగారు. వార్డు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

JAI RAM, MADURAWADA
Published on: 18 Oct 2026 8:47 PM IST
Bheemili
X

Bheemili: 7వ వార్డు అభివృద్ధే ధ్యేయం: కూటమి అభ్యర్థి బోయి రమాదేవి!

Bheemili: ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ 7వ వార్డును అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని కూటమి అభ్యర్థి బోయి రమాదేవి తెలిపారు. వార్డు ప్రజల ఆదరాభిమానాలతో పాటు పార్టీ నాయకుల మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచానని పేర్కొన్నారు.

1999 నుంచి తాను, తన భర్త బోయి వెంకటరమణ (శ్రీను) పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఆమె వెల్లడించారు. తనపై నమ్మకంతో 7వ వార్డు కూటమి అభ్యర్థిగా అవకాశం కల్పించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు, తనకు అండగా నిలిచి ప్రోత్సహించిన మొల్లి హేమలతకు కృతజ్ఞతలు తెలిపారు.

వార్డులోని ప్రజా సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రమాదేవి స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పన, వార్డు అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. 7వ వార్డు ప్రజల ఆశీస్సులు కోరుతూ, తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బోయి రమాదేవి తెలిపారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA