Madhurawada: మారికవలసలో గడపగడపకు వైఎస్సార్‌సీపీ ప్రచారం!

Madhurawada: జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోని సాయిరాం కాలనీ, మారికవలసలలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పోతిన హనుమంతరావు విస్తృతంగా గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

JAI RAM, MADURAWADA
Published on: 25 Oct 2026 11:09 PM IST
Madhurawada
X

Madhurawada: మారికవలసలో గడపగడపకు వైఎస్సార్‌సీపీ ప్రచారం!

మధురవాడ: జీవీఎంసీ 6వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పోతిన హనుమంతరావు ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. సాయిరాం కాలనీ, మారికవలస, దేవిమెట్ట, రిక్షా కాలనీ తదితర ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.

ప్రచారంలో భాగంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA